నక్కల్ల తోడేస్తున్నారు..?
–అడ్డొస్తే చంపేస్తామని బెదిరింపులే..?
-సమాచారం ఇచ్చిన పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం..?
–అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
నిజామాబాద్ జిల్లా
నవంబర్ :10 (తెలంగాణ నేత్రం) : బ్యూరో:
ముప్కాల్. ముక్కాల్ మండలంలోని వెంచిర్యాల్ పెద్దవాగు నుండి ఇసుకను నక్కల తోడేస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారుల అనుమతి పొంది బ్యాంకులో డీడీలు చెల్లించిన తర్వాత తాసిల్దార్లు వే బిల్లులు జారీచేస్తారు. నిబంధనలను తుంగలో తొక్కి మాకు ఎవరు అడిగేవారని రాజకీయ పార్టీలకు సంబంధించిన అక్రమార్కులు ఎలాంటి వే బిల్లులు లేకుండా ఇసుకను టిప్పర్లు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి లక్షలు గడిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సైతం ఇసుక జాతరను తలపించింది. గత కొన్ని నెలలుగా ఈ తతంగం జరుగుతున్న రెవెన్యూ అధికారులకు తెలిసిన అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ముడుపులు తీసుకోవడంతో అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజల్లో చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే..? అక్రమంగా ఇసుకను తరలించకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పదే పదే రెవెన్యూ అధికారులకు చెబుతున్న పెడచెవున పెడుతుండడం గమనార్వం.