–రేపటి నుంచి జనగామలో మహాశివరాత్రి మహోత్సవాలు..
–పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం.
–ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ..
గోదావరిఖని, ఫిబ్రవరి 25(తెలంగాణ నేత్రం)
అతి ప్రాచీనమైన మూడు నిలువెత్తు శివలింగములతో అత్యంత ప్రాశస్త ల పవిత్ర గోదావరి నది సమీపము నందు గల శ్రీశ్రీశ్రీశ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నేడు శివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ, దేవాలయ కమిటీ బాధ్యులు తెలిపారు.అత్యంత వైభవంగా సంప్రదాయరీతిలో మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ మాట్లాడుతూ.. బుధవారం
ఉదయం 4 గంటలకు మంగళవాయిద్యాలతో స్వామి వారి మేలుకొలుపు, గణపతి పూజ ,స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరం తీర్థ ప్రసాద వితరణ మరియు రాత్రి గం|| 12-05 ని॥ల వరకు అభిషేకములు, అర్చనలు, సాయంత్రం పార్వతి పరమేశ్వరుల రథోత్సవము నిర్వహించబడుతుంది. అనంతరం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి.రాత్రి 9 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమములు,రాత్రి గం|| 12-05 ని॥లకు లింగోద్భవ సమయములో స్వామి వారికి బిల్వ అష్టోత్రము,రాత్రి గం|| 12-30 ని॥లకు స్వామి వారికి అభిషేకము
నిర్వహిస్తామని తెలిపారు.27 గురువారం రోజున మ॥ 12 గంటలకు అన్నదానం కావున తామెల్లరు సకుటుంబ సమేతముగా విచ్చేసి, కోరిన కోర్కెలను తో కాశంకరుడైన ఆ దేవ దేవుడైన పరమశివుణ్ణి దర్శించి తమతమ జీవితాలను ధన్యము చేసుకొని , ముక్తిని పొందవలసినదిగా కోరారు. ఈ శివ రాత్రి మహోత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నారు.