- ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
- కాంగ్రెస్ చేసిన మెాసాలను ప్రజలకు వివరించాలి
- భవిష్యత్తు మనదే… కలసికట్టుగా ముందుకు సాగుదాం
బి.ఆర్.ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గులాభీ సైనికులు పనిచేయాలి - రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని ఫిబ్రవరి 25 తెలంగాణ నేత్రం:
అబద్దాల హామిలతో గద్దెనేక్కినా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అని భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
మంగళవారం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీలో బిఆర్ఎస్ రామగుండం నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరుకంటి చందర్ టిఆర్ఎస్ శ్రేణులు ఉద్దేశించి మాట్లాడారు.రాబోయే రోజులు మనవే నని… గులాబీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చందర్ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్న శ్రేణుల నిబద్ధత ఎంతో గొప్పదన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కాంగ్రెస్ మోసపూరిత హామీలను గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి పల్లెలో గులాబీ శ్రేణులు కలియతిరగాలని, బిఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమమే లక్ష్యంగా తాము పని చేశామని అయితే పదవుల కోసం మాత్రం ఉద్యమంలో తిరగ లేదని చెప్పారు. పదవులే ప్రధానంగా, హోదలే లక్ష్యంగా ఉద్యమ పార్టీలో తిరగడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విస్తృతస్థాయి సమావేశంలో ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు, శ్రేణులతో కోరు కంటి చందర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మూల విజయ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, మాజీ జడ్పిటీసీ అముల నారాయణ, మాజీ కార్పోరేటర్లు పెంట రాజేష్, పాముకుంట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
RELATED ARTICLES