సింగరేణి సీఎండి నీ కలిసిన సుందిళ్ళ భూ నిర్వాసితులు.
గోదావరిఖని, ఫిబ్రవరి 13(తెలంగాణ నేత్రం)
సింగరేణి సీఎం డి బలరాం నాయక్ ను రామగిరి మండలం సుందిళ్ల గ్రామ సింగరేణి నిర్వాసితులు కమాన్ పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు ఆధ్వర్యంలో గురు వారం 11 గని పైన కలిశారు. గత నాలుగు సంవత్సరాలుగా భూములు కోల్పోయి వ్యవసాయం లేక పరిహారం రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు వచ్చే నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని సీఎండీకి మొరపెట్టుకున్నారు. సానుకూలంగా స్పందిన సీఎం డి ,బలరాం నాయక్ రైతులకు రావలసిన పరిహారాన్ని న్ని త్వరలోనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ ఇచ్చారు. సిఎండి హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.