Thursday, April 17, 2025

అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు…. రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్

*అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు…. రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్

*ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాల ఏర్పాటు

*ఇందిరమ్మ ఇండ్లకు తీసుకొని ఉచితంగా అందించేలా చర్యలు

*ఇసుక రీచ్ వద్ద అవసరమైన మేర సిసి రోడ్డు నిర్మించాలి

*ఇసుక రీచ్ ల వద్ద డిస్పాచ్ లను పెంచాలి

*ఇసుక రీచ్ లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన మైనింగ్ శాఖ కార్యదర్శి

ముత్తారం, ఫిబ్రవరి 15:

జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ అన్నారు.

శనివారం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్వాగతించారు. అనంతరం ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి, జిల్లెలపల్లి గ్రామాలలో ఉన్న ఇసుక రీచ్ లను టి.జి.ఎం.డి.సి వైస్ చైర్మన్ బి.ఆర్.వి సుశీల్ కుమార్ లతో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని, నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసి అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలని అన్నారు.

ఇసుక రీచ్ వద్ద 400 మీటర్ల మేర సిసి రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇసుక రీచ్ ల వద్ద డిస్పాచ్ సెంటర్ లను పెంచాలని అన్నారు.

ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, లైట్స్ ఏర్పాటు చేయాలని, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఒకే ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని , ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలం జిల్లెలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేసి, పిల్లలతో ముచ్చటించి వారికి పాఠ్యాంశాలను బోధించారు.

ఈ తనీఖీలలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి ,సం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular